కాఫీవిత్…ఆర్.రమాదేవి..1405-ఎ.రజాహుస్సేన్

*ప్రియా..! విన్నపాలు వినవలె…”!
*Apointment please….!!
I don't plan ....I mean it. “ !!
రమాదేవి మార్క్ ప్రేమ కవిత ఇది..తన కంఫర్ట్ జానర్లోనే  రాసిన కవిత..I don't plan ....!!
పొద్దుతిరుగుడు పువ్వులా తన చుట్టూ తానే గీతలు గీసుకుంటున్న ఓ ప్రేయసి ప్రేమ సుధ ఈ
కవిత…ఈరోజు కాఫీటైమ్లో ఈ కవిత గురించి …తెలుసుకుందాం.

“నిను చూడాలనో ...మాట్లాడాలనో
నీతోనే పూర్తిగా ఉండిపోవాలనో
పనిగట్టుకుని ప్రణాళికలేమి వేయను
అధాటున
కాస్తంత పలకరించాలనిపిస్తుంది
చెప్పుకోదగ్గ కారణాలేమీ ఉండవు
అనిపించిందే తడవు
నీవు వచ్చి వెళ్లిన దారి కొలతలు వేస్తాను
మాట్లాడని సమయపు ఎత్తుకొలుస్తాను
సరితూగని కొలతలను అకారణంగా ద్వేషిస్తాను
పొద్దుతిరుగుడు పువ్వులా
నా చుట్టూ నేనే గీతలు గీసుకుంటూ
తిరకాసు లెక్కలు కుప్పగా పోసి
అన్నిటికీ చెల్లుగీతలు గీస్తాను
ఓయ్ !
సమయము లేదనే నీకు
ఊరకనే
ఓ దరఖాస్తు వేస్తాను
బుట్టదాఖాలు చేసుకో
పనిలేని పనిమంతురాలినే కదా
మరో దరఖాస్తు వేస్తానులే”!!
*I don't plan ....
*ఆర్.రమాదేవి…!!

ప్రియుడ్ని కలవటానికి ప్రియురాలికి అపాయింట్మెంట్ కావాలా? దానికోసం అప్లికేన్ పెట్టుకోవాలా?
ఎన్నిసార్లు కలవాలని చూసినా సమయము లేదనే అతగాడి అపాయింట్ మెంట్ కోసం ముందస్తుగా..
దరఖాస్తు తప్పదేమో? అతగాడ్ని చూడాలనో…మాట్లాడాలనో,అతనితోనే పూర్తిగా ఉండిపోవాలనో పనిగట్టుకుని వేసిన
ప్రణాళికలేమీ ఆమెవద్ద లేవు.. కాకుంటే కాస్తంతపలకరించాలనిపిస్తుందామెకు..దానికి చెప్పుకోదగ్గ కారణాలేమీ లేవనుకోండి..అది వేరేసంగతి.
అతగాడ్ని కలవాలని ఆమెకు అనిపించిందే తడవుగా అతగాడు  వచ్చి వెళ్లిన దారి కొలతలు వేస్తుంది.
మాట్లాడని సమయపు ఎత్తుకొలుస్తుంది.‌సరితూగని కొలతలుంటే అకారణంగా ద్వేషిస్తుంది…
పొద్దుతిరుగుడు పువ్వులా తనచుట్టూ తనే గీతలు గీసుకుంటూ,తిరకాసు లెక్కలు కుప్పగా పోసి అన్నిటికీ చెల్లుగీతలు గీస్తుంది.‌ తనను కలవడానికి సమయము లేదనే అతగాడికి తమరి అపాయింట్ కావాలి స్వామీ అంటూ, ఊరకనే  ఓ దరఖాస్తు వేస్తుంది…సమయం ఇస్తే ఇవ్వు లేకుంటే బుట్టదాఖలు చేసుకో, పనిలేని పనిమంతురాలినే కదా మరో దరఖాస్తు వేస్తానులే”అంటోదిఈ  కవయిత్రి ఆర్.రమాదేవి..!!

*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!